తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాటి కవరేజీపై నిబంధనలు స్పష్టంగా వెల్లడించాలి' - ఐఆర్‌డీఏఐ సంస్థ నూతన ఆదేశాలు

మానసిక జబ్బులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్న వారికి బీమా కవరేజీ ఇలా ఇస్తామనే విషయమై నిబంధనలను బీమా కంపెనీలు స్పష్టంగా వెల్లడించాలని బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. బీమా కంపెనీలు ఈ నిబంధనలను తమ వెబ్‌సైట్లలో ప్రచురించాలని స్పష్టం చేసింది. ఇందువల్ల బీమా రంగంలో పారదర్శకత మరింత పెరుగుతుందని పేర్కొంది.

IRDAI latest news
IRDAI latest news

By

Published : Jun 10, 2020, 6:23 PM IST

సాధారణ, జీవితబీమా, ఆరోగ్య బీమా సంస్థలన్నీ నూతన నిబంధనలను 2020 అక్టోబరు 1 నుంచి తప్పకుండా అనుసరించాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. ఆయా వ్యాధులు ఉన్న వారితో ఎలా వ్యవహరిస్తామనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలియాల్సి ఉందని వివరించింది. ఆరోగ్యవంతులతో పాటు వ్యాధులున్న వారికి నిబంధనలు ఎలా వర్తిస్తాయో తెలపాలని కోరింది.

2017 నాటి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ నియంత్రణ చట్టం, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం నిబంధనలూ పాటించాలని సూచించింది. ఈ ఏడాది జులై 31 నాటికి బీమా సంస్థలన్నీ లీగల్‌ ఎంటిటీ ఐడెండిఫైయర్‌ స్మృతి అమలు చేయాలని కోరింది. ఆర్థిక డేటాలో నాణ్యత, కచ్చితత్వానికి ఇది కీలకం అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details