తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇన్​స్పైర్'తో వ్యవసాయ వ్యాపారాభివృద్ధి ​ - గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్​ రాజేంద్రనగర్​ ఆచార్య జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్​స్పైర్​ పేరుతో దక్షిణాది ప్రాంతీయ వ్యాపార వ్యవసాయ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్​ తమిళిసై రేపు ప్రారంభించనున్నారు.

'ఇన్​స్పైర్'తో వ్యవసాయ వ్యాపారాభివృద్ధి ​

By

Published : Oct 20, 2019, 5:30 AM IST

Updated : Oct 20, 2019, 7:36 AM IST

'ఇన్​స్పైర్'తో వ్యవసాయ వ్యాపారాభివృద్ధి ​
వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ పట్టా రాగానే ఉద్యోగాలడిగే విద్యా విధానంలో కొత్త మార్పలు తేవాలని తాజాగా హైదారాబాద్​ రాజేంద్రనగర్​లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంకల్పించింది. పట్టభద్రులంతా నిరుద్యోగులుగా మారుతున్న దృష్ట్యా ఈ ఏడాది నుంచి కొత్త విధానం తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. ఈ-ఐడియా విభాగం ప్రారంభించి పట్టభద్రులు, యువత, అంకుర సంస్థల నిర్వాహకులను ఆహ్వానించింది. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపారాభివృద్ధి నైపుణ్యం పెంపు కోసం ఆసక్తి ప్రేరేపించేందుకు "ఇన్‌స్పైర్‌" పేరిట రేపట్నుంచి రెండు రోజులపాటు దక్షిణాది ప్రాంతీయ వ్యాపార ఆధారిత వ్యవసాయ సదస్సు జరగనుంది. తొలి రోజు ఈ స్ఫూర్తి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ ప్రారంభించనున్నారు.
Last Updated : Oct 20, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details