తెలంగాణ

telangana

ETV Bharat / state

అతివలు వీరిని స్ఫూర్తిగా తీసుకోండి.. అనుకున్నది సాధించండి!

women's day Inspiration : చరిత్రలో ఎంతో మంది మహిళలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఉన్నత స్థానాలు అధిరోహించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్ప వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

women's day
women's day

By

Published : Mar 8, 2023, 2:15 PM IST

women's day Inspiration: ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు దీన్ని ఒక పండగలా జరుపుకుంటారు. మానవ చరిత్రలో.. ప్రారంభంలో వివక్ష, అసమానతకు గురైనా.. నాగరికత పెరిగే కొద్దీ ఆధునికత యుగంలో ఎంతో మంది స్త్రీలు వాటన్నిటినీ ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. చరిత్రలో తమకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.

మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు స్త్రీల గురించి తెలుసుకుందాం. గతంతో పాటు... ఈ మధ్య కాలపు మహిళలు, వారు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మీరూ గొప్ప కార్యాలు చేయడానికి పూనుకొండి.

ఇందిరా గాంధీ

1. ఇందిరా గాంధీ (Indiraa Gandhi) : ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరా గాంధీ.. మన దేశంలో అత్యంత కీలకమైన ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

సోనియా గాంధీ

2. సోనియా గాంధీ (Sonia Gandhi) : ఇందిరా గాంధీకి కోడలు అయిన సోనియా సైతం తన నాయకత్వ లక్షణాలతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయింది. అంతేకాకుండా తన హయాంలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆమె సొంతం.

మమతా బెనర్జీ

3. మమతా బెనర్జీ (Mamatha Benarjee) : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆ రాష్ట్రాన్ని 1977 నుంచి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన జ్యోతి బసును ఓడించి సీఎం పీఠాన్ని అధిష్టించి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా.. అక్కడ జరిగిన గత ఎన్నికల్లో ప్రధాని మోదీ హవాను సమర్థంగా ఎదుర్కొని మళ్లీ సీఎం అయ్యారు.

అవని లేఖరా

4. అవని లేఖరా (Avani Lekhara) : తాను దివ్యాంగురాలు అయినప్పటికీ ఎక్కడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా పారాలింపిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం సాధించి చరిత్రలో పేరు సంపాదించారు.

మాళవిక సిద్ధార్థ

5. మాళవిక సిద్ధార్థ (Malavika Sidhartha) : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ సుమారు రూ.7 వేల కోట్లు అప్పుల్లో కూరుకుపోయి 2019 లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య మాళవిక కుంగిపోకుండా.. వెనకడుగు వేయకుండా ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుని అప్పు తీర్చడానికి సిద్ధపడ్డారు. అందులో పని చేసే ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడకుండా కాపాడారు.

. జ్యోతి నైన్‌ వాల్‌

6. జ్యోతి నైన్‌ వాల్‌ (Jyothi Nainwal) : దీపక్ నైన్వాల్ అనే ఆర్మీ ఆఫీసర్ 2018 లో జరిగిన ఉగ్ర దాడిలో వీర మరణం పొందారు. అయితే తన జీవిత భాగస్వామి జ్యోతి నైన్‌ వాల్‌ ఆయన చివరి కోరిక తీర్చేందుకు.. ఆర్మీలో శిక్షణ తీసుకుని మరీ సైన్యంలో చేరారు. అప్పటికీ ఆమెకు 33 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉండటం గమనార్హం.

జెసిండ అర్డెన్

7. జెసిండ అర్డెన్ (Jesinda Arden) : న్యూజిలాండ్ మాజీ ప్రధాని అయిన జెసిండ అర్డెన్ కొవిడ్‌ని ధీటుగా ఎదుర్కొని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిన సమయంలో తమ దేశంలో దాన్ని కట్టడి చేసి, జీరో కేసులు సాధించిన ఘనత సొంతం చేసుకున్నారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న ఏ అధ్యక్షుడు, ప్రధానికి సాధ్యం కాని పనిని ఆమె చేసి నిరూపించారు.

8. మారిన అరివా (Yarina Arivaa) : ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ మహిళ.. యుద్ధం జరుగుతున్న సమయంలో వార్తల్లో నిలిచారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న సమయంలో పెళ్లి చేసుకున్న వెంటనే తన భర్తతో కలిసి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details