అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ - Devaryamjal lands latest news
18:13 May 03
అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ
మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరికొందరు... దేవాలయ భూములు ఆక్రమించారని వస్తున్న కథనాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్‌లోని..... సీతారామ ఆలయ భూముల ఆక్రమణలపై విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కమిటీని వేసింది.వెయ్యి కోట్లకు పైనే విలువైన 1,521 ఎకరాల భూమి ఉండగా వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా.. దర్యాప్తునకు ఆదేశించింది. పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది.
ఈ కమిటీలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళి కేరి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిలను... సభ్యులుగా నియమించింది. ఆక్రమణకు గురైన భూమి వివరాలు సేకరించటం, ఆక్రమణకు గురైన తీరు తెలుసుకోవటం.. ప్రస్తుతం భూమి ఉపయోగిస్తున్న విధానం.. ధ్రువపత్రాల సేకరణ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల విస్తీర్ణం, దేవాలయానికి జరుగుతోన్న నష్టంపై దర్యాప్తు చేయాలని.. కమిటీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఏఎస్ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. ఇదే సమయంలో దేవరయంజాల్ భూముల్లో విజిలెన్స్, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేపట్టారు.
ఇదీ చదవండి:ఖమ్మం కార్పొరేషన్ తెరాస కైవసం