విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ - విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంలో విచారణ
15:54 October 09
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది నివేదికపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సహా డిస్కంలు పిటిషన్ వేశాయి. ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేయగా తెలంగాణ విద్యుత్ సంస్థలు విధుల్లో చేర్చుకోలేదని పలువురు ఉద్యోగులు కూడా పిటిషన్ దాఖలు చేశారు.
రిలీవ్ అయిన ఉద్యోగులు 4 నెలల నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాది నరసింహ... సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం సమగ్ర విచారణ చేపడతామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి :త్రివేణి జల సవ్వడులతో...