తెలంగాణ

telangana

TS Highcourt: టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

By

Published : Jan 30, 2022, 4:13 AM IST

TS Highcourt: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశించింది. తగిన అర్హతలు లేనివారిని టీఎస్​పీఎస్సీ సభ్యులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టింది.

TS Highcourt: టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ
TS Highcourt: టీఎస్​పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

TS Highcourt: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తగిన అర్హతలు లేకున్నా సర్వీసు కమిషన్‌ సభ్యులుగా నియమించడాన్ని సవాల్​ చేస్తూ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్దంగా సభ్యులను నియమించారన్నారు. మరో ఐదారు నెలల్లో సభ్యుల పదవీకాలం పూర్తవుతుందని దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్నారు. సర్వీసు కమిషన్​ మాత్రమే కౌంటర్‌ దాఖలు చేసిందని... ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు చివరిగా మరో అవకాశం ఇస్తూ విచారణను మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details