రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కారించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ లేకుండానే వివాదాలను తేలుస్తున్నాయన్న పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. విచారణ లేకుండా పరిష్కరించిన కేసులెన్నో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జిల్లాల వారీగా ట్రైబ్యునళ్లలో పెండింగ్ కేసులు సమర్పించాలని.. బదిలీ జరిగిన కేసులు, పరిష్కారమైన వాటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.