Innovative Expo in Vignan College :నేటి యువతలోని సృజనాత్మకతను వెలికితీసి వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో వేదికలున్నాయి. వాటి సాయంతో యువత అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. అలాంటి ఆవిష్కరణల కోసం.. యువతలోని నైపుణ్యాన్ని బయటకు తీసి వారికి తోడ్పాటును అందించడానికి హైదరాబాద్లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన్ ఇన్నోవేటివ్ ఎక్స్‌పో-2023 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ శాఖలు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.
Tech Fest in Vignan College Hyderabad :ఈ విద్యార్థులంతా తమలోని నైపుణ్యాన్ని ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. వివిధ రకాల ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో చూపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 386 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. అందులో చాలా వరకు సామాజిక అంశాలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ టెక్ ఫెయిర్ చూడటానికి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా వచ్చారు. విజ్ఞాన్ విద్యార్థులు, అధ్యాపకులు.. సందర్శకులకు తమ ప్రాజెక్టుల వివరాలు వివరించారు.