తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాత ఇన్నోవేషన్ ఇంక్యూబేటర్ టీ-హబ్ రెండవ ఫేస్ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్మాణం చివరి దశలో ఉన్న టీ-హబ్ నూతన భవనాన్ని సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
'ఇన్నోవేషన్ ప్రపంచంలో హైదరాబాద్ స్థానం ముందుకెళ్తోంది'
ఇన్నోవేషన్ ఇంక్యూబేటర్ టీ-హబ్ రెండో ఫేస్ నూతన భవనాన్ని మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. రెండవ ఫేస్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
మంత్రి కేటీఆర్
టీ-హబ్ విస్తరణలో భాగంగా అందుబాటులోకి వచ్చే ఈ నూతన సదుపాయం ద్వారా ఇన్నోవేషన్ ప్రపంచంలో హైదరాబాద్ స్థానం మరింత బలపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'సరిహద్దులో శాంతితోనే ద్వైపాక్షిక సంబంధాల పురోగతి'