తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్​ నేరాల కట్టడికి భాగ్యనగరంలో ఇన్నోవేషన్​ సెంటర్

సాంకేతికతతో పాటు రోజురోజుకు సమస్యలూ పెరుగుతున్నాయి. సాంకేతికతతో ఉత్పన్నమయ్యే సమస్యలను అరికట్టడానికి కేంద్రం హైదరాబాద్​ రామంతపూర్​లో ఏర్పాటు చేసిన సైబర్​ రీసెర్చ్​ ఇన్నోవేషన్​ అండ్​ కెపాసిటీ బిల్డింగ్​ సెంటర్​ను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

innovation center at ramanthapur in Hyderabad to prevent cyber crime
సైబర్​ నేరాల కట్టడికి భాగ్యనగరంలో ఇన్నోవేషన్​ సెంటర్

By

Published : Feb 25, 2020, 5:08 AM IST

Updated : Feb 25, 2020, 7:51 AM IST

యువతలో ఉన్న సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాన్ని బయటకు తీయడానికి డీఆర్డీవోతో కలిసి కేంద్రం... దేశవ్యాప్తంగా 5 యంగ్​ సైంటిస్ట్​ ల్యాబ్​లను ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్​ రామంతపూర్​లోని సీడీటీఐ భవన్​లో సైబర్​ రీసెర్చ్​ అండ్​ కెపాసిటీ బిల్డింగ్​ సెంటర్​ను ప్రారంభించారు.

సాంకేతికతతో జీవనం సాఫీగా మారినా... సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్​గా మారుతున్నాయని కిషన్​రెడ్డి అన్నారు. సైబర్​ క్రైమ్స్​ను అరికట్టడానికి కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. హైదరాబాద్​లో టాప్ ఐటీ కంపెనీలతో పాటు నేషనల్ డిఫెన్స్ సెంటర్లున్నాయని.. వాటి భాగస్వామ్యంతో ఈ సెంటర్ పనిచేయాలని సూచించారు

సైబర్ క్రైమ్, సైంటిఫిక్ టెక్నిక్స్​తో పాటు ఫోరెన్సిక్​పై పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడానికే ఈ సెంటర్​ను ఏర్పాటు చేశామని.. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కరుణ సాగర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్​ అధికారులకు సైబర్ క్రైమ్​తో పాటు సాంకేతిక అంశాలు, మెలకువలపై ఈ సెంటర్​లో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.

సైబర్​ నేరాల కట్టడికి భాగ్యనగరంలో ఇన్నోవేషన్​ సెంటర్
Last Updated : Feb 25, 2020, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details