దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఘటన జరిగిన 9 రోజుల్లోపే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా దిశకు న్యాయం జరిగిందన్న గళమే వినిపిస్తోంది.
ఏడేళ్లైనా... న్యాయం జరగలేదు
కానీ 2012 డిసెంబర్ 16న దిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచారంలో నిందితులకు ఇంకా శిక్ష పడకపోవడంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చమొదలైంది. నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురిని దోషులుగా గుర్తించగా... ఒక వ్యక్తి తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా ఐదుగురిలో ఒకరు మైనర్ కావడం వల్ల మూడేళ్ల తర్వాత విడుదలయ్యాడు. మిగతా నలుగురు దోషుల్ని జైళ్లోనే ఉంచారు.