గత నెల 27, 28 తేదీల్లో దిశ ఘటన జరిగిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. దిశను అపహరించి, అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. నలుగురు నిందితులు మృతదేహాన్ని చటాన్‌పల్లి వద్ద తగలబెట్టినట్లు వివరించారు. ఈ నెల 30న నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు. కోర్టు 10 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిందని పేర్కొన్నారు.
వస్తువులు చూపెట్టకుండా
ఈనెల 4న నిందితులను చర్లపల్లి జైలు నుంచి కస్టడీకీ తీసుకున్నట్లు సీపీ వివరించారు. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారని అన్నారు. దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను తీసుకు వచ్చామని, ఘటనాస్థలంలో వస్తువులు చూపెట్టకుండా పోలీసులపై దాడికి దిగారని పేర్కొన్నారు. నిందితులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారని వివరించారు.
పోలీసుల వద్ద తుపాకీ కూడా లాక్కుని కాల్పులకు యత్నించారని హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదని సీపీ తెలిపారు. పలు మార్లు హెచ్చరించిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయన్నారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని స్పష్టం చేశారు.
నిందితుల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు: సీపీ ఇదీ చూడండి : లైవ్ వీడియో: నిందితుల చేతిలో రివాల్వర్