తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 6:23 PM IST

ETV Bharat / state

ఓయూలో జేఏసీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష

ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కొవిడ్ వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షకు మద్దతుగా తెలంగాణ విద్యార్థి ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ మానవతారాయ్ మద్దతు తెలిపారు.

ఓయూలో జేఏసీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష
ఓయూలో జేఏసీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష

కరోనా వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నాయకుడు ప్రతాప్‌ రెడ్డి.. ఓయూ అరణ్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్ష చేస్తామని అనుకున్న విద్యార్థులను పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతించలేదు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఓయూలోకి ప్రవేశించి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పాడుబడ్డ వాటర్స్ మధ్య దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా తెలంగాణ విద్యార్థి ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ మానవతారాయ్ మద్దతు తెలిపారు.

కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చేంతవరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఓయూ జేఏసీ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థులకు అనుకోనిది జరిగితే కేసీఆర్ బాధ్యత వహించాలని మానవతా రాయి డిమాండ్ చేశారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ జేఏసీ విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చూడండి:30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్​ నిర్మించాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details