ఉన్నత విద్యావంతులు పోలీస్ శాఖలోకి వస్తుండటం శుభపరిణామమని... వారి ప్రతిభకు అనుగుణంగా పదును పెట్టి ప్రజలకు మరింత సేవలు అందేలా చూస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీజీలు పూర్తి చేసిన అభ్యర్థులు ఎంపిక కావడం ఆశించదగ్గ విషయమని హోంమంత్రి అన్నారు. కానిస్టేబుల్ శిక్షణాభ్యర్థుల 9 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రారంభమైన కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం - కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మహమూద్ అలీ
సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి ఎంపికైన వారిలో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉండటం పట్ల హోంమంత్రి, సీపీ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నేటి నుంచి శిక్షణ ప్రారంభమైంది. సుమారు 16 వేల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని పేట్లబురుజు, చెల్లాపూర్, గోషామహల్, బేగంపేట్ కేంద్రాల్లో 1095 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరం... దేశంలోని అభివృద్ధి చెందిన నగరంగా పేరు పొందిందని శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో కీలకమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తాలి: కేటీఆర్
TAGGED:
సీపీ అంజనీకుమార్