హైదరాబాద్ పాతబస్తీ మెటర్నిటీ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
అప్పుడే పుట్టిన శిశువు మృతి..ఆసుపత్రి ధ్వంసం.. - హైదరాబాద్ పాతబస్తీ
హైదరాబాద్ పాతబస్తీలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోవడం వల్ల బంధువులు ఆగ్రహించారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మెటర్నిటీ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి
కాన్పుకోసం పెట్లాబుర్జ్ ఆస్పత్రికి వచ్చిన మహిళకు వైద్యులు ఆపరేషన్ చేశారు. పుట్టిన కొద్దిసేపటికే బిడ్డ చనిపోవడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న చార్మినార్ పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'
Last Updated : May 14, 2020, 8:56 AM IST