రాష్ట్ర బడ్జెట్లో పరిశ్రమల రంగానికి చేసిన కేటాయింపుల పట్ల పరిశ్రమ వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈసారి బడ్జెట్లో పరిశ్రమలకు 3,077 కోట్లతో పాటు, పారిశ్రామిక రాయితీల కింద 2,500 కోట్లు కేటాయించడం పట్ల తెలంగాణ పరిశ్రమల సమాఖ్య-సీఐఐ, పారిశ్రామిక వేత్తల సమాఖ్య-టీఐఎఫ్, టీటా పరిశ్రమలు హర్షం వ్యక్తం చేశాయి.
కేటాయింపుల పట్ల పరిశ్రమ వర్గాలు సంతృప్తి
దీర్ఘకాలిక వినతి అయిన పారిశ్రామిక రాయితీలను పరిగణలోకి తీసుకున్నందుకు పరిశ్రమ వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఐటీ రంగానికి చేసిన కేటాయింపులు మాత్రం కొద్దిగా నిరాశను మిగిల్చాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
దీర్ఘకాలిక వినతి అయిన పారిశ్రామిక రాయితీలను పరిగణలోకి తీసుకున్నందుకు టీఐఎఫ్ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు పేర్కొన్నారు. కరోనాతో రాష్ట్ర ఎకానమీ తీవ్రంగా ప్రభావితమైనా అన్ని రంగాలకు సమంగా కేటాయింపులు చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి చేసిన కేటాయింపులు మాత్రం కొద్దిగా నిరాశను కలిగించాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి రంగాలలో ఐటీ విస్తరణ, ఐటీని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలించేలా మరిన్ని కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని ఐటీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.