తెలంగాణ

telangana

ETV Bharat / state

భవానీ దీక్ష విరమణ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు - బెజవాడ కనకదుర్గ ఆలయం

భవానీ దీక్ష విరమణ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిని ముస్తాబు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా.... ఐదు లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

indrakeeladri-is-preparing-for-bhavani-deeksha-viramana
భవానీ దీక్ష విరమణ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

By

Published : Dec 17, 2019, 10:50 AM IST

Updated : Dec 17, 2019, 11:52 AM IST

భవానీ దీక్షల విరమణలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు... ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ ఏడాది ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు భవానీలు దీక్ష విరమణ చేసేందుకు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే కొండపైన, కింద ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో వచ్చే భక్తులు, భవానీలకు తగలకుండా వస్త్రాలతో టెంట్లు వేస్తున్నారు. క్యూలైన్లలో ఉండే వారికి విసుగు కలగకుండా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి అమ్మవారి చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీలు ప్రదర్శించనున్నారు.

భవానీ దీక్ష విరమణ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

స్నానాలకు ఇబ్బంది లేకుండా...
భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించిన అనంతరం ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా కనకదుర్గనగర్​లో 12 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవానీలు కేశాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద... కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానం చేసేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజి దిగువన నదిలో 3.5 అడుగుల నీటి మట్టాన్ని పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోర్ల ద్వారా జల్లు స్నానాలకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మల్లన్న బోనాలు... చూదము రారండి

Last Updated : Dec 17, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details