తెలంగాణ

telangana

ETV Bharat / state

'అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం' - తెలంగాణ మండలి సమావేశాలు2020

ప్రత్యేక రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. లక్ష్యసాధనకు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.

indrakaran reddy speak on hairthaharam at mlc
అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

By

Published : Sep 9, 2020, 11:58 AM IST

హరితహారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞ వలే తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేసున్నారని మంత్రి ఇంద్రకణ్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అడవుల్లో భారీగా మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో 21.33 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచాలనే ఈ కార్యక్రమం పెట్టికున్నామని వివరించారు. ఈ భారీ లక్ష్యసాధనకు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రణాళికలు రూపొందించారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details