తెలంగాణ

telangana

ETV Bharat / state

Indoor Sky Diving: గాల్లో తేలే మజాను ఆస్వాదించాలనుకుంటున్నారా?

Indoor Sky Diving: వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం నుంచి ఒక్కసారిగా దూకి గాల్లో అలా తేలుతూ ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా?! స్కైడైవింగ్‌ వీడియోలు చూస్తూ... జీవితంలో ఒక్కసారైనా మనం ఈ అనుభూతి పొందితే ఎంత బాగుండో అనుకున్నారా?! అయితే మీ ఆశలు నెరవేర్చుకునేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లో రేపట్నుంచే ఇండోర్‌ స్కై డైవింగ్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తోంది.

Indoor Sky Diving: గాల్లో తేలే మజాను ఆస్వాదించాలనుకుంటున్నారా?
Indoor Sky Diving: గాల్లో తేలే మజాను ఆస్వాదించాలనుకుంటున్నారా?

By

Published : Apr 8, 2022, 3:22 AM IST

గాల్లో తేలే మజాను ఆస్వాదించాలనుకుంటున్నారా?

Indoor Sky Diving: గాల్లో తేలుతూ గింగిరాలు కొట్టాలనే కోరిక ఎవరికుండదు?! కానీ అది అందరికీ అందేది కాదు. వేరే దేశాలకు వెళ్లాలి.. ఎంతో ఖర్చు చేయాలి. పైగా అందుకు ఎంతో శిక్షణ అవసరం. కానీ ఇదంతా లేకుండా మన హైదరాబాద్‌లోనే... స్కైడైవింగ్‌ మజాను ఆస్వాదించే అవకాశం తరుణం వచ్చేసింది. గండిపేటలో గ్రావిటీ జిప్‌ పేరిట ఇండోర్‌ స్కైడైవింగ్ సెంటర్‌ రేపట్నుంచే ప్రారంభం కాబోతోంది.

గాల్లో ఎగరాలనే కలను నిజం చేయాలనే..హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన రమణ రెడ్డి, సుశీల్‌ రెడ్డి.. గాల్లో ఎగరాలనే కలను నిజం చేయాలనే లక్ష్యంతో గ్రావిటీ జిప్‌ను ప్రారంభించారు. మూడేళ్లు శ్రమించి ఈ సెంటర్‌ను తీర్చిదిద్దారు. దేశవిదేశాల్లో అత్యంత ఖరీదైన ఈ క్రీడను.. మొదట పుట్టిన గడ్డపైనే ప్రారంభించాలని హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. కేవలం 2, 3వేలతో గాల్లో తేలే అనుభూతిని అందిస్తామని వారు చెబుతున్నారు.

మా కుటుంబసభ్యుల్లో ఒకరు అమెరికా వెళ్లినపుడు దీనిని చూశారు. ఇది ఇండియాలో ఎక్కడా లేదు. మనదేశం నుంచి చాలా మంది బయట దేశాలకు వెళ్లి చేస్తుంటారు. ఇది మన దగ్గర ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మనం పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రారంభించాం. -రమణా రెడ్డి, నిర్వాహకులు

మా ఉద్దేశంలో ఇప్పటివరకు చాలా మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఎప్పుడు ప్రారంభం అవుతుందని అడిగారు. ఇది విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. -సుశీల్‌ రెడ్డి, నిర్వాహకులు

స్కైడైవింగ్‌ మజాను ఆస్వాదించండిలా.. ఆరేళ్ల వయసుంటే చాలు ఎవరైనా గాల్లో ఎగరవచ్చని శిక్షకులు చెబుతున్నారు. స్కై డైవింగ్‌ చేసే వారి కోసం ప్రత్యేక దుస్తులు, షూస్‌, శిరస్త్రాణం వంటివి అందిస్తామని చెబుతున్నారు. తొలుత శిక్షకుల వద్ద కొంత సమయం తర్ఫీదు పొందిన తర్వాత... గ్రావిటీ టన్నల్‌లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఓ శిక్షకుడు తోడుతో స్కైడైవింగ్‌ మజాను ఆస్వాదించవచ్చు.

అనుభూతి కావాలంటే..రేపట్నుంచి సెంటర్‌ అందుబాటులోకి రాబోతుండగా ఇప్పటికే కొంతమంది గ్రావిటీ జిప్‌ సెంటర్‌లో స్కైడైవింగ్‌ను ఆస్వాదించారు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని వారు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ సెంటర్‌ను సందర్శించాలని సూచిస్తున్నారు. స్కైడైవింగ్‌ను స్పోర్ట్‌గా ఎంచుకోవాలనుకున్నా.. కాలక్షేపానికైనా.. మానసిక ఉల్లాసానికైనా... గ్రావిటీని ఎదురించి గాల్లో ఎగిరే అనుభూతి కావాలంటే ఓ సారి గండిపేటకు వెళ్లాల్సిందే.


ఇదీ చదవండి: వాహన ఫిట్​నెస్​ టెస్ట్​కు కేంద్రం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు!

ABOUT THE AUTHOR

...view details