Indo Infra Developers Members Help : నిలువ నీడ లేక... గడ్డకట్టుకుపోయే చలిలో రోడ్డు పక్కనే నివాసముంటున్న వారికి ఆపన్నహస్తం అందిచారు ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సభ్యులు. రోడ్డు పక్కన ఉంటూ చలికి వణుకుతున్న వారికి బ్లాంకెట్స్ అందించి.. తమకు తోచిన విధంగా ఆ అభాగ్యులకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈవో శివగణేశ్ కూతురు మళ్లెం ఉన్నతి బ్రింధ పుట్టిన రోజు సందర్భంగా దుప్పట్లు పంచారు. ఆ సంస్థకు చెందిన ఎస్.కె.పి అచివర్స్ టీంతో పాటు సంస్థ సభ్యులు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్తో పాటు నగరంలోని రోడ్ల పక్కన వారికి, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఉన్న పేషంట్ల ఆటెండర్స్కు దుప్పట్లు పంపిణీ చేశారు.
Indo Infra Developers Members Help: అభాగ్యులకు ఆపద్బాంధవులుగా ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ - తెలంగాణ వార్తలు
Indo Infra Developers Members Help : రోడ్ల పక్కనే నివాసముండే అభాగ్యుల పట్ల ఆపద్బాంధవులుగా నిలిచారు ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సభ్యులు. గడ్డకట్టుకుపోయే చలిలో రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న పేదలకు కప్పుకోవడానికి దుప్పట్లు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నగరంలో దాదాపు రెండు వేల మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.

అభాగ్యులకు ఆపద్బాంధవులగా ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ సభ్యులు
రెండు రోజుల పాటు సుమారు 2వేల బ్లాంకెట్స్ అందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని సంస్థ సభ్యులు పాలెం శివకృష్ణ గౌడ్ అన్నారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో వారికి తమ వంతు సహకారం అందించామని పేర్కొన్నారు. ప్రతి వేడుక సందర్భంగా తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బాల్ రెడ్డి, వాసవి, మల్లికార్జున్, కల్యాణ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Swachh Autos Distribution : 'సఫాయి అన్నా.. నీకు సలామ్'