తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 5:19 AM IST

ETV Bharat / state

'పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం'

మాదాపూర్​లోని హెచ్​ఐఐఐసీలో ఇండి వుడ్ ఎక్స్​లెన్స్ అవార్డు- 2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​ హాజరయ్యారు.

తెలంగాణ అనువైన రాష్ట్రం

పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన రాష్ట్రమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​ అన్నారు. గడిచిన ఐదేళ్లలో 18 దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్రంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయన్నారు. మాదాపూర్​లోని హెచ్​ఐఐఐసీలో నిర్వహించిన ఇండి వుడ్ ఎక్స్​లెన్స్ అవార్డు-2019 ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న 22 మందికి అవార్డులు అందజేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టిన 70 శాతం కంపెనీలు క్షేత్రస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఇండి వుడ్ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఆర్​ఎస్​కే సోహన్ రాయ్ అన్నారు.

మాదాపూర్​లోని హెచ్​ఐఐఐసీలో ఇండి వుడ్ ఎక్స్​లెన్స్ అవార్డు

ABOUT THE AUTHOR

...view details