ఏపీలోని విశాఖలో కరోనా నిబంధనల కారణంగా ఏడునెలల పాటు మూసేసిన ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ మంగళవారం తెరుచుకోనుంది. జంతుప్రదర్శనశాలలో సందర్శకులకు అనుమతినిస్తూ అటవి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సందర్శకులు నేరుగా కౌంటర్ల ద్వారా లేదా ఆన్ లైన్లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ రేపు పున:ప్రారంభం - విశాఖలో తెరుచుకోనున్న జూలాజికల్ పార్క్
కరోనా కారణంగా ఏడునెలల పాటు మూసివేసిన ఏపీలోని విశాఖ ఇందిగాంధీ జూలాజికల్ పార్క్‌ను మంగళవారం తెరవనున్నారు. ఈ మేరకు సందర్శకులకు అనుమతినిస్తూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ రేపు పున:ప్రారంభం
సందర్శకులు కొవిడ్ నియామాలు పాటించాలని తెలిపారు. ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. జూ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్కాన్ , శానిటైజర్ అందుబాటులో ఉంచారు. జూ అధికారిక వెబ్ సైట్లో కూడా టికెట్లను పొందవచ్చునని, విశాఖ జూ క్యూరేటర్ నందిని సలారియా ప్రకటించారు.
ఇదీ చదవండి:గ్రేటర్ పోటీకి ఒక్కరోజే రెండొందల దరఖాస్తులు