తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ ఆరేళ్ల పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగింది: బండి సంజయ్​

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను ప్రజలందరూ స్మరించుకోవాలన్నారు.

indipendance day celebrations at bjp state office
మోదీ ఆరేళ్ల పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగింది: బండి సంజయ్​

By

Published : Aug 15, 2020, 10:24 AM IST

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షడు, ఎంపీ బండి సంజయ్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి,నల్లు ఇంద్రసేనా రెడ్డి, బాబుమోహన్ తదితరులు పాల్గొన్నారు.

సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్లలో చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను ఆదుకునేందుకు రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీని ప్రకటించారని కొనియాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ రజాకార్ల పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ప్రగతి భవన్, ఫామ్​హౌస్ నుంచి పాలన సాగిస్తున్నాడంటూ దుయ్యబట్టారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను నియంత్రించే దమ్ము కేసీఆర్​కు లేదన్న ఆయన.. మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రంపై నేరం మోపుతున్నాడంటూ మండిపడ్డారు.

ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని సంజయ్​ ఆరోపించారు. అభివృద్ధి కోసం అప్పులు చేయాలి తప్ప.. జేబులు నింపుకోవడానికి కాదని దుయ్యబట్టారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనేక రంగాల్లో మార్పు..

రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో భాజపా ప్రభుత్వం అనేక మార్పులు తెచ్చిందని ఎమ్మెల్సీ రాంచందర్​ పేర్కొన్నారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని మోదీ తక్కువ కాలంలోనే చేసి చూపించారని తెలిపారు.

మోదీ ఆరేళ్ల పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగింది: బండి సంజయ్​

ఇదీచూడండి: 'అసెంబ్లీ వద్ద ఘనంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు'

ABOUT THE AUTHOR

...view details