తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవస్థలు పడుతున్నాం... ఇండియాకు తీసుకెళ్లండి' - idnains facing problems in dubai due to covid-19

దుబాయ్​లో ఉన్న భారతీయులు కరోనా కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి వీసా గడువును అక్కడి ప్రభుత్వం పొడిగించినప్పటికీ ఉద్యోగాల్లేక, చేతిలో డబ్బు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. తమను త్వరగా స్వదేశానికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఓ యువతి విజ్ఞప్తి చేసింది.

indians-in-dubai-facing-problems-amid-corona-situations
మమ్మల్ని త్వరగా భారత్​కు తీసుకెళ్లండి

By

Published : Jun 1, 2020, 6:05 PM IST

మమ్మల్ని త్వరగా భారత్​కు తీసుకెళ్లండి

దుబాయ్‌ సహా ఇతర దేశాల్లోని విదేశీయులకు వైద్యంతోపాటు అవసరమైన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పలితంగా.. ఆయా దేశాల్లోని భారతీయులు తిండికి సైతం ఇబ్బంది పడుతున్నారు. దుబాయ్‌లో భారతీయుల వీసా గడువు పొడిగించినప్పటికీ.. ఉద్యోగాలు, ఆదాయం లేక స్వదేశానికి వచ్చేందుకు వారు ఎదురు చూస్తున్నారు.

ఎనిమిది నెలల క్రితం అక్కడికి వెళ్లిన ఏపీలోని విశాఖకు చెందిన ఓ తెలుగు జంట.. ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు పోవటంతో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అరబ్ దేశాల్లోని చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతున్నా... తమ వంతు ఎప్పుడు వస్తుందన్న నిరీక్షణ వారిని మానసిక వేదనకు గురిచేస్తోందని చెప్పింది. తమను స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటోంది.

ఇదీ చదవండి:కరోనా యోధులదే అంతిమ విజయం: ప్రధాని

ABOUT THE AUTHOR

...view details