తెలంగాణ

telangana

ETV Bharat / state

రికార్డు స్థాయికి చేరిన అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య - 10 లక్షల మందిలో మనవాళ్లే 26 శాతం

Indian Students Studying Higher Education in America : ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 35 శాతం పెరిగింది. కరోనా పరిస్థితుల తర్వాత మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య.. 2022-23 విద్యా సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేనంతగా 2,68,923కి చేరింది. అంతర్జాతీయ విద్యా సంస్థ.. ఐఐఈ తాజాగా ఓపెన్ డోర్స్ రిపోర్టును విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో దాదాపు 26 శాతం భారతీయులేనని నివేదిక వెల్లడించింది.

Higher Education in America
Indian Students Studying Higher Education in America

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 9:10 AM IST

రికార్డు స్థాయిలో అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులు-ఏకంగా చైనానే దాటిపోయాంగా

Indian Students Studying Higher Education in America : ఉన్నత విద్య కోసం అమెరికా(US Education)కు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్యరికార్డు స్థాయికి చేరింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35 శాతానికి పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన సుమారు 10 లక్షల మందిలో మనవాళ్లే 26 శాతం ఉన్నారని 'ఓపెన్‌ డోర్స్‌ నివేదిక'(Open Doors Report) వెల్లడించింది.

కరోనా మహమ్మారి(Corona Virus) మునుపటి స్థితికి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్లు తెలిపింది. 22-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గత 40 ఏళ్లలో ఇదే గరిష్ఠం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. తర్వాత స్థానం భారత్‌ది. ఈ రెండు దేశాల నుంచే 53 శాతం మంది ఉంటున్నారు. అయితే భారతీయ విద్యార్థుల అన్ని దేశాల విశ్వవిద్యాలయాల్లోనూ చదవడానికి వెళుతుంటారు.. కానీ ఎక్కువగా యూఎస్​, యూకే యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు మొగ్గు చూపుతారు.

అమెరికా చదువుకు భారత్​లో మహా క్రేజ్​

International Education Institution IIE Open Doors Report : అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్‌ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్‌ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గత మూడేళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా ఉంటున్నాయి.

Indian Students Studying in US Universities : అమెరికా గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో 21 శాతం పెరుగుదల కనిపించగా.. అండర్‌ గ్రాడ్యుయేట్‌లలో ఒక శాతం పెరిగింది. గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రాంలలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్, బిజినెస్‌ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇల్లినోయీ, టెక్సాస్, మిషిగాన్‌లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కన్నా భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు. కొవిడ్‌కు ముందు అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా సుమారు 11 లక్షలు ఉండేది. కొవిడ్‌ తర్వాత తగ్గి ఈ ఏడాది మళ్లీ ఆ స్థాయికి చేరువయింది.

అమెరికాలో ఉన్నత విద్యకు భారతీయులు మొగ్గు- ఎంత మంది చదువుతున్నారంటే?

అందని ద్రాక్షగానే అమెరికా వీసా.. అయోమయంలో విద్యార్థులు ఎదురు చూపులు

ABOUT THE AUTHOR

...view details