ఇప్పటి వరకు దేశంలోని 15 రాష్ట్రాలకు 1,274 ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేశామని రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 21,392 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును తరలించినట్లు పేర్కొంది. మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్‌కు 3,797, మధ్యప్రదేశ్‌కు 656, దిల్లీకి 5,476, హరియాణాకు 2,023, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలించినట్లు వెల్లడించింది.
'ఇప్పటి వరకు 21,392 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలింపు' - తెలంగాణ వార్తలు
నేటి వరకు వివిధ రాష్ట్రాలకు 21,392 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను చేరవేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 313 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపించామని రైల్వే శాఖ ప్రకటించింది.
Oxigen Express Marathan
కర్ణాటకకు 2,115 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320, తమిళనాడుకు 1,808, ఏపీకి 1,738, పంజాబ్‌కు 225, కేరళకు 380, తెలంగాణకు 1,858, జార్ఖండ్‌కు 38, అసోంకు 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొంది.
ఇదీ చూడండి:Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు