తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంకర్లలో ఆక్సిజన్​ సరఫరా: భారతీయ రైల్వే - కొవిడ్ రోగుల కోసం తయారైన కోచ్​లు

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. పలు చోట్ల ఆక్సిజన్‌ అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేల ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేసేందుకు అనుమతించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాయి. దీనిపై రైల్వేశాఖ సుముఖత వ్యక్తం చేసింది. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్​ను సరఫరా చేసేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

supply of liquid medical oxygen in trains
ట్యాంకర్లలో ఆక్సిజన్​ సరఫరా

By

Published : Apr 18, 2021, 8:14 PM IST

కొవిడ్ బారినపడి అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అత్యంత కీలకమైంది. పలు చోట్ల ఆక్సిజన్‌ కొరతతో రోగులు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైల్వే ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ట్యాంకర్లను తరలించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖను సంప్రదించాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే శాఖ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. వివిధ రాష్ట్రాల్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఎత్తుకు తగ్గట్లు వ్యాగన్లను తయారు చేసినట్లు వెల్లడించింది. వివిధ ప్రదేశాల్లో ఆయా వ్యాగన్లతో నమూన రవాణా కూడా చేసినట్లు వివరించింది. అలాగే సరఫరా ఏర్పాట్లపై నిమగ్నమైనట్లు తెలిపింది. ఆక్సిజన్ తరలింపులో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పూర్తిగా సిద్ధం కావాలని ఆయా జీఎంలను ఆదేశించింది.

2020 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారతీయ రైల్వే.. కొవిడ్ రోగులకు చికిత్సలు అందించేందుకు కోచ్​లను తయారు చేసింది. వాటిలో వైద్య పరికరాలు, ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం రెండో దశ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. భారతీయ రైల్వేలోని 16 జోన్లలో ఇటువంటి కోచ్​లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:మరో ముగ్గురు నటులకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details