భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో రైలును హైదరాబాద్లోని సనత్నగర్ రైల్వే స్టేషన్ నుంచి దిల్లీలోని ఆదర్శ్ నగర్ స్టేషన్ల మధ్య ప్రారంభించింది. ఈ కార్గో ఎక్స్ప్రెస్ రైలు ప్రతి బుధవారం బయలుదేరుతుంది. ఈ రైలును 6నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సాధారణంగా, సరుకు రవాణా రైళ్ల ద్వారా పలు పారిశ్రామిక ఉత్పత్తులు అధిక మొత్తాలలో రవాణా చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో నెలకొన్న పరిస్థితుల మూలంగా స్వల్ప మొత్తాల్లో కూడా సరుకులను రవాణా చేసే సంస్థల సంఖ్య పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో నెలకొన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు విస్తృతమైన అవకాశాలను కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్గో ఎక్స్ ప్రెస్ సేవలతో సింగిల్ వ్యాగన్ బుక్ చేసుకునే వినియోగదారులకు సైతం వేగవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
తక్కువ ధరలకే..