తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడతాం' - దక్షిణ మధ్య రైల్వే జనరల్​ బాడీ మీటింగ్​

ప్రైవేట్ రైలు ఆపరేటర్ల వల్ల కార్మికులకు, ప్రజలకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య తెలిపారు. ఈ మేరకు చిలకలగూడలో నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం 31వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ రైల్వేలో ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

indian railway secretary raghavayya told movement against privatization in railways'
' ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడతాం'

By

Published : Feb 5, 2021, 8:11 PM IST

భారతీయ రైల్వేలో ప్రైవేటీకరణను వ్యతిరేకంగా తాము ఉద్యమబాట పడతామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య తెలిపారు. ఈ మేరకు చిలకలగూడలో నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం 31వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రైల్వే ఉపకరణాలతో పోలిస్తే 30 శాతం తక్కువకే ప్రొడక్షన్ యూనిట్లలో రోలింగ్ స్టాక్ తయారవుతోందన్న రాఘవయ్య వాటిని ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని భావిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ రైలు ఆపరేటర్ల వల్ల కార్మికులకు, ప్రజలకు, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని సంఘాలతో కలిపి ఒకే ఫోరమ్ వేదికగా ఉద్యమ బాట పట్టే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందన్న రాఘవయ్య ఆ దిశగా త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...

ABOUT THE AUTHOR

...view details