తెలంగాణ

telangana

ETV Bharat / state

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్ల క్రమబద్ధీకరణ - corona effect on railways

కరోనా వైరస్​ కట్టడి చర్యల్లో భాగంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ దృష్ట్యా.. పలు రైళ్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

train news
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్ల క్రమబద్ధీకరణ

By

Published : Mar 21, 2020, 6:36 AM IST

Updated : Mar 21, 2020, 8:20 AM IST

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్ల క్రమబద్ధీకరణ

కొవిడ్ -19 వ్యాప్తి నియంత్రించే చర్యల్లో భాగంగా చేపట్టిన జనతా కర్ఫ్యూ దృష్ట్యా భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు రైళ్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్​ తెలిపారు.

మార్చి 22న ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య దూరప్రాంతాలకు వెళ్లే 1,300 మెయిల్, ఎక్స్​ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లను రద్దుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ముంబయి, దిల్లీ, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్, సికింద్రాబాద్​లలో సబర్బన్ సర్వీసులను అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించడం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 21 అర్ధరాత్రి నుంచి 22 రాత్రి 10 గంటల వరకు బయలుదేరే 2,400 సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే నడుస్తున్న రైళ్లు యథావిధిగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇవీచూడండి:కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం:కేసీఆర్​

Last Updated : Mar 21, 2020, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details