తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకియాట్రిక్ సొసైటీ 53వ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈటల - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఇండియన్​ సైకియాట్రిక్​ సొసైటీ సౌత్​ జోనల్​ బెంచ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ వార్షిక సదస్సులో మంత్రి ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. సరైన సమయంలో మానసిక సమస్యలను గుర్తించడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు.

psychiatric society program visited by minister eetala rajendar
సైకియాట్రిక్ సొసైటీ 53వ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈటల

By

Published : Oct 31, 2020, 8:53 PM IST

రోజురోజుకు ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ మానసిక సమస్యలు అదే స్థాయిలో ఉద్ధృతమవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​ ఏర్పాటు చేసిన ఇండియన్​ సైకియాట్రిక్​ సొసైటీ సౌత్​ జోనల్​ బెంచ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కొవిడ్​ ఆంక్షల నేపథ్యంలో వెబినార్​ రూపంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఐదు రాష్ట్రాలకు చెందిన 1300 మంది సైకియాట్రిస్టులు పాల్గొన్నారు. సరైన సమయంలో మానసిక సమస్యలను గుర్తించడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. సైకియాట్రిస్టుల సంఖ్య గణనీయంగా పెరగాలన్న మంత్రి ప్రభుత్వాసుపత్రుల్లో సైకియాట్రిస్ట్​ల నియామకాలను ప్రోత్సాహిస్తామన్నారు.

ఇదీ చూడండి: రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details