వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సూచనలను ప్రజలు ముందే పొందే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు. వర్షాలపై ప్రజలకు, రైతులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇవ్వడానికి భారత వాతావరణ శాఖ మూడు యాప్‌లను రూపొందించిందని ఆమె తెలిపారు. రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిస్తే సమీపంలోని చెట్ల కిందకు వెళ్తుంటారు.
ఇకపై పిడుగులు ఎక్కడ, ఎప్పుడు పడతాయో "యాప్" చేప్పేస్తోందట! - వర్షాలు
పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు వర్షం పడితే చెట్లకిందకు పరిగెడుతుంటారు. చెట్లపై పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి వారి కోసం భారత వాతావరణ శాఖ మూడు యాప్‌లు రూపొందించింది. ఆ యాప్‌ల ద్వారా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సూచనలను ముందే తెలుసుకోవచ్చు.
వర్షాలు, పిడుగులపై ముందే సమాచారం
చెట్లపై పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. వారి సెల్‌ఫోన్లలో మూడు యాప్‌లుంటే ముందస్తు హెచ్చరికలు తెలుసుకుని ప్రాణాలను కాపాడుకునే అవకాశముంటుందని నాగరత్న వివరించారు. యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేవారు తమ ఫోన్ నంబరు, తాము ఉన్న ప్రాంతం పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
మూడు యాప్‌లు రూపొందించిన వాతావరణ శాఖ
- రెయిన్ అలారం యాప్:మనం ఉన్న ప్రదేశానికి 20కి.మీ. పరిధి వరకు సమీపంలో ఎక్కడ వర్షం పడుతుందనేది హెచ్చరికల ద్వారా తెలుపుతుంది.
- దామిని యాప్:20కి.మీ.లోపు పిడుగులు, ఉరుములు, మెరుపులపై అలారంతో హెచ్చరిక వస్తుంది.
- మేఘ్‌దూత్ యాప్:రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఏ మండలంలో ఎప్పుడు వర్షం పడుతుందనేది ముందే తెలుపుతుంది. ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుందనే సూచనలూ ఇస్తుంది.
ఇవీ చూడండి: డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్‌లపై నిషేధం