IMD on Southwest Monsoon: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. నైరుతీ రుతుపవనాల ఉత్తర పరిమితి అండమాన్ నుంచి లాంగ్ ఐలాండ్స్ ప్రాంతం వరకూ రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాగల 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు తదితర ప్రాంతాలకూ విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం సహా పరిసర ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనువుగా వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు తెలియచేసింది. దీని ప్రబావంతో కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువాారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
IMD on Southwest Monsoon: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించాయని ఐఎండీ తెలిపింది. విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువాారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
మరోవైపు.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని చాలా చోట్ల ముందస్తు రుతుపవన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 3 రోజుల్లో మూడు ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశ ఉందని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఇవీ చదవండి: