Budget 2023: గ్లోబల్ హబ్ ఫోర్ మిల్లెట్స్ కింద మిల్లెట్స్‌లో భారతదేశం చాలా ముందున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం మిల్లెట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేపట్టడం జరుగుతుందని పార్లమెంట్‌లో వెల్లడించారు.
పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6వేల కోట్లు ఇస్తుండగా.. వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్ల వరకూ లక్ష్యం నిర్దేశించ బడిందన్నారు. రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు, పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భారతదేశం దేశం ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతుందన్న నిర్మల... పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6వేల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.20లక్షల కోట్ల వరకూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులను పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.