Special Story on Aneeshwar : ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన కుంచాల అనిల్-స్నేహ దంపతులు యూకేలో స్థిరపడ్డారు. వీరికి ఓ బాబు ఏడేళ్ల అనీశ్వర్ ఉన్నాడు. 4 ఏళ్ల ప్రాయం నుంచే వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తిని కనబర్చిన చిన్నారి.. ప్రకృతిపై ఉన్న మక్కువ ఇంట్లో వారితో, స్నేహితులతో మాట్లాడుతుంటే కనిపిస్తూ ఉండేది. కరోనా సమయంలో వందేళ్లు నిండిన ఓ వృద్ధుడు యూకేలో వైద్య సేవల కోసం విరాళాలు సేకరిస్తుండటాన్ని టీవీలో గమనించిన అనీశ్వర్.. తనకున్న ఆసక్తిని తల్లిదండ్రులతో చెప్పాడు. అలా తానూ విరాళాల సేకరణకు అడుగులు వేసి 3 వేల పౌండ్లను, పీపీ కిట్‌లను భారత్ దేశానికి సహాయంగా అందజేశాడు.
ఈ క్రమంలోనే 'లిటిల్ పెడ్లర్స్ ఛాలెంజ్'ను ఏర్పాటు చేసి సైకిల్ తొక్కుతూ ప్రజలకు కొవిడ్ గురించి, అవగాహన కల్పిస్తూ నిధులు సేకరించే ప్రయత్నం చేశాడు ఈ లిటిల్ అనీశ్వర్. ఈ ఛాలెంజ్‌లో తన స్నేహితులనూ భాగస్వామ్యం చేసి, లిటల్ పెడ్లర్స్, అనీశ్ అండ్ ఫ్రెండ్స్‌గా మార్చాడు. 57 మంది పిల్లలతో కలిసి అనీశ్ ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
బ్రిటన్‌లో ప్రముఖ టీవీ రియాల్టీ షోలో మెరిసి..: అతి చిన్న వయస్సులో అనీశ్వర్ అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తీరును చూసి కుటుంబసభ్యులు, బంధువులు గర్వపడుతున్నారు. వీటితో పాటు బొమ్మలు వేయటం, అమెరికా, బ్రిటన్‌లలో ప్రముఖ టీవీ రియాల్టీ షోల్లో పాల్గొంటూ అబ్బురపరుస్తున్నాడు. బ్రిటెన్స్ గాట్ ట్యాలెంట్‌లో ఫైనల్-5 వరకు వెళ్లిన ప్రవాస భారతీయుడిగా అనీశ్ పేరు తెచ్చుకున్నాడు. అద్భుత కవితా శక్తితో ఎంతగానో ఆకట్టుకున్నాడు.