కరోనా సుదీర్ఘ విరామం తర్వాత భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సతీమణితో కలిసి భాగ్యనగర పర్యటనకు వచ్చారు. ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఉదయం నార్మ్ నిర్వహించిన వెబినార్‌లో ప్రఖ్యాత రైతాంగ ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా 120 జయంతి ఉత్సవాల్లో ఉపన్యాసం చేశారు.
భాగ్యనగర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి - హైదరాబాద్ తాజా వార్తలు
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. కరోనా కాలంలో సుదీర్ఘ విరామం తర్వాత సతీమణితో కలిసి ఆయన నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రహోంమంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.
![భాగ్యనగర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి INDIA vice president vists hyderabad after long time in corona situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9465724-64-9465724-1604744625150.jpg)
భాగ్యనగర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి
ఆస్కీలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సాయంత్రం విద్యానగర్‌లోని మహిళా కళాశాలలో జరిగే మరో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బసచేసి... ఆదివారం మరో కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. సోమవారం తిరిగి ఉపరాష్ట్రపతి దిల్లీ వెళ్లనున్నారు.