హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సీడీ ఫౌండేషన్, అఫ్గనిస్తాన్ ఎంబసీ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది. పదిరోజుల పాటు ఈ అఫ్గాన్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఈ ఫెస్టివల్‌లో అఫ్గానిస్తాన్ కాన్సులేట్ జనరల్ మహమ్మద్ సులేమాన్ కక్కర్ పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్ల మార్పిడే ప్రపంచీకరణ ప్రధాన అస్త్రాలని తెలిపారు.
భారత్-అఫ్గాన్ బంధానికి గుర్తుగా ఫుడ్‌ఫెస్టివల్ - India-Afghan food festival
సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్ల మార్పిడే ప్రపంచీకరణ ప్రధాన అస్త్రాలని అఫ్గానిస్తాన్ కాన్సులేట్ జనరల్ మహమ్మద్ సులేమాన్ కక్కర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సీడీ ఫౌండేషన్, అఫ్గనిస్తాన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు.
కరోనా వల్ల ఇరుదేశాల వాణిజ్యంపై ఎటువంటి ప్రభావం లేదని.. ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, టెక్స్‌టైల్ వంటి అనేక ఉత్పత్తుల దిగుమతికి ఎప్పటికీ తమకు భారతే ప్రాధాన్య దేశమని అఫ్గాన్ కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఫుడ్ ఫెస్ట్ లో భాగంగా అఫ్గాన్ వంటకాలైన పులావ్, అఫ్గన్ నాన్, సమోసా, బొరానీ, గోష్-ఎ-ఫిల్, ల్యాంబ్ మంటు, అఫ్గాన్ ఫెర్ని వంటి వంటకాలు నోరూరించాయి.
- ఇదీ చదవండి :బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు