జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనరల్ స్థానంలో కూడా గంగా పుత్రులకు టికెట్ ఇవ్వనందున వారి గుర్తింపు, సమస్యల పరిష్కారం కోసం స్వతంత్ర అభ్యర్థిగా యస్.చంద్ర ప్రకాష్ బరిలోకి దిగారు.
'స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ' - పాతబస్తీలో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం
గంగ పుత్రుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం కొరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి యస్.చంద్ర ప్రకాష్ తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
'స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ'
హైదరాబాద్ పాతబస్తీ జంగంమేట్ డివిజన్లో భారీగా గంగా పుత్రులు ఉన్నా కుడా.. వారికి టికెట్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తమ ఉనికి కోసం బరిలోకి దిగిన తనను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి :హైదరాబాద్ పేరు భాగ్యనగర్‌గా మారుస్తాం: అర్వింద్