రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాచిగూడ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... స్వతంత్ర అభ్యర్థి మహమూద్ అలీ ప్రచారం చేశారు.
'ఓటు వేయండి... కొత్త మార్పును తీసుకురండి' - ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి... బంగారు తెలంగాణను తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యావేత్త, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మహమూద్ అలీ తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
!['ఓటు వేయండి... కొత్త మార్పును తీసుకురండి' independent mlc candidate campaign at kachiguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10634048-91-10634048-1613379023403.jpg)
'ఓటు వేయండి... కొత్త మార్పును తీసుకురండి'
రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పనిచేశానని, ప్రస్తుతం హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వహిస్తున్న అనుభవం తనకు ఉందని అలీ తెలిపారు. ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు బాగా తెలుసని... ఎన్నికల్లో గెలిపిస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరూ ఓటు వేసి... మార్పును తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి:పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన