హైదరాబాద్ నగరంలో పంద్రాగస్టు సందడి మొదలైంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులుతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన వెలుగుల్లో నిశిరాత్తిరి వేళ నింగి, నేల మధ్య జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్లుగా ప్రకాశిస్తున్నాయి విద్యుద్దీపాలు. జెండా పండుగ కోసం....నగరంలోని అసెంబ్లీ, బీఆర్కే భవన్, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్ గార్డెన్, అమరవీరుల స్థూపం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్నాయి.
త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం - lighting
పంద్రాగస్టు వేడుకల కోసం భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఎటుచూసిన త్రివర్ణశోభిత కాంతులీనుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కారించుకొని నగరంలోని భవంతులు, ప్రధాన ప్రాంతాలు త్రివర్ణ కాంతులతో శోభాయమానంగా తయారయ్యాయి.
![త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4138459-thumbnail-3x2-lighting-rk.jpg)
త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్న భాగ్యనగరం