తెలంగాణ

telangana

ETV Bharat / state

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు - indepemdence day

స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ప్రాంగణంగా నిలిచిన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సాయుధ పోరాట వీరుల్లో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌

By

Published : Aug 15, 2019, 3:42 PM IST

Updated : Aug 15, 2019, 5:12 PM IST

హైదరాబాద్​ కొండాపూర్​లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయుధ పోరాట వీరుల్లో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని వెంకటేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కమ్యూనిస్ట్​ యోధుడు చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉంటున్నవారికి ఏదో రూపంలో స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం ఉండడం విశేషం. అలనాటి పోరాట స్మృతులను వారు ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు
Last Updated : Aug 15, 2019, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details