fiber cylinder : ఇనుముతో తయారు చేసిన ఎల్‌పీజీ సిలిండర్ల స్థానంలో.. ఫైబర్(స్మార్ట్) సిలిండర్లు వచ్చేశాయి. ఇండేన్ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది. పది కిలోల గృహ వినియోగ సిలిండర్‌కు రూ.3,350, అయిదు కిలోల సిలిండర్‌కు రూ.2,150 ధరావతు చెల్లించాలి. రూ.670 చెల్లించి 10 కిలోల సిలిండర్‌లో, రూ.330 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌లో గ్యాస్ నింపించుకోవచ్చు.
fiber cylinder : అందుబాటులోకి ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్
fiber cylinder: ప్రస్తుతం వినియోగిస్తున్న ఇనుముతో తయారు చేసిన ఎల్‌పీజీ సిలిండర్ల స్థానంలో.. ఫైబర్(స్మార్ట్) సిలిండర్లు వచ్చేశాయి. ఇండేన్ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయిస్తోంది.
fiber cylinder
Indane fibre cylinder : వినియోగదారులు ఇప్పటికే వాడుతున్న పాత సిలిండర్లను తిరిగి ఇచ్చి వీటిని పొందవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుకింగ్ చేసుకున్న గంటల వ్యవధిలోనే ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహిస్తున్న ‘గో ఎలక్ట్రిక్ ఎక్స్‌పో’లో ఇండేన్ సంస్థ ఈ కొత్త సిలిండర్లను ప్రదర్శించింది.
ఇదీ చూడండి:LPG Cylinder Blast Insurance: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా అండ.. ఎంతవరకు పొందొచ్చంటే?