రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 1,472 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ నెల రెండో తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,525 భూలావాదేవీలు పూర్తయ్యాయి. 63 లక్షల 63 వేల మంది పోర్టల్‌ను వీక్షించగా 38,132 మంది సైన్ అప్ చేసుకున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా క్రమంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు - సీఎస్ సోమేశ్ కుమార్ తాజా వార్తలు
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 1,472 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ నెల రెండో తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,525 భూలావాదేవీలు పూర్తయ్యాయి.
ధరణి పోర్టల్ ద్వారా క్రమంగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
ఇప్పటి వరకు పది కోట్లా 77 లక్షల రూపాయల చెల్లింపులు జరిగాయి. మార్ట్ గేజ్ డీడ్స్, బ్యాంక్ మాడ్యూల్, నాలా మాడ్యూల్ తదితర అదనపు సేవలను పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన ధరణి వార్ రూమ్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇదీ చదవండి:ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్