తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భూగర్భజలమట్టం పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో భూగర్భజలాల సగటు 5.38 మీటర్లుగా నమోదయింది. నిరుడు సెప్టెంబర్లో సగటు 9.85 మీటర్లుగా ఉండగా... ఈ ఏడాదికి ఏకంగా 4.47 మీటర్ల మేర పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు 720 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 1078 మిల్లీమీటర్లు నమోదైంది. 27 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం - etv bharath
రాష్ట్ర భూగర్భజలమట్టం గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ మాసంలో రాష్ట్రంలో భూగర్భజలాల సగటు 5.38 మీటర్లుగా నమోదయింది. నిరుడు సెప్టెంబర్లో సగటు 9.85 మీటర్లుగా ఉండగా... ఈ ఏడాదికి ఏకంగా 4.47 మీటర్ల మేర పెరిగింది.
ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ నిరుటితో పోలిస్తే భూగర్భజలమట్టం పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఏకంగా 11.68 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో అతి తక్కువ లోతులో కేవలం 1.36 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక లోతున 16.10 మీటర్ల సగటులో ఉన్నాయి. రాష్ట్ర భూభాగంలోని 56 శాతం విస్తీర్ణం వరకు భూగర్భజలాలు కేవలం ఐదు మీటర్ల లోపే ఉన్నాయి. గత పదేళ్ల సెప్టెంబర్ నెలలో భూగర్భజలాలను పరిశీలిస్తే ప్రస్తుత ఏడాది 524 మండల్లాలో పెరుగుదల ఉంది.
ఇదీ చదవండి:నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్