కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు... ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్, ట్రస్ట్ ఆసుపత్రుల్లో సైతం చర్యలు చేపడుతున్నారు. అధికారుల సర్వేల్లో ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ అందించటమే కీలకమని తేలింది. వీటి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ట్యాంక్‌లు నిర్మించనున్నారు.
'ఏపీలో 40 వేల మందికి కరోనా చికిత్స అందించేలా ఏర్పాట్లు'
కరోనా కేసుల ఉద్ధృతితో.... వైద్య సేవలు మరింత పెంచేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీవ్యాప్తంగా 40వేల మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రోజుకు దాదాపు వేయి వరకూ కరోనా కేసులు వస్తున్నందున.. వైద్య పరంగా బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
'ఏపీలో 40 వేల మందికి కరోనా చికిత్స అందించేలా ఏర్పాట్లు'
ప్రైవేట్ ఆసుపత్రుల్లో 8వేల ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్