తెలంగాణ

telangana

ETV Bharat / state

రికార్డు స్థాయిలో పెరిగిన విద్యుత్ వినియోగం!

ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవటం, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఐదు నెలలపాటు డిమాండ్ తగ్గుతూ వచ్చింది.

increased-power-consumption-at-a-record-level-in-india-and-telangana
రికార్డు స్థాయిలో పెరిగిన విద్యుత్ వినియోగం!

By

Published : Jan 24, 2021, 8:10 AM IST

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం రికార్డుస్థాయిలో 187.3 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈ నెల 20న అత్యధికంగా 185.8 గిగావాట్లు, గతేడాది డిసెంబరు 30న 182.89 గిగావాట్ల డిమాండ్ నమోదైంది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవటం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగం మరింత పెరగడంతో విద్యుత్ డిమాండ్ క్రమేపీ పెరుగుతోంది.

లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఐదు నెలలపాటు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబరులో 1.7శాతం, అక్టోబరులో 3.4 శాతం, డిసెంబరులో 7.3 శాతం వంతున పుంజుకుంది. రాష్ట్రంలోనూ విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం అత్యధికంగా 13,157 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్రంలో శుక్రవారం విద్యుత్ వినియోగం 240 మిలియన్ యూనిట్లు కాగా... గతేడాది ఇదే రోజు 220 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:తరువుకొస్తోంది తనువు.. తల్లడిల్లుతోందని 'చిన్నారి' మనువు!

ABOUT THE AUTHOR

...view details