కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రోజురోజుకు రద్దీ పెరుగుతుంది. హైదరాబాద్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నాలుగు కొవిడ్ కేంద్రాలు ఉన్నాయి. షాపూర్‌నగర్, సురారం కేంద్రాల వద్ద ఉదయం నుంచే పరీక్షలు చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అనుమానితులు, కాంటాక్ట్ కేసుల వారు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఉదయం నుంచే క్యూలో నిల్చున్నా... తమను పట్టించుకోవడం లేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు పాజిటివ్ ఉంటే... పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో కొవిడ్ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ... - hyderabad latest news on covid centers
హైదరాబాద్‌లో కరోనా పరీక్షకేంద్రాల వద్ద రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం నుంచి లైన్లో నిల్చుంటే.. తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో కొవిడ్ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ...