Lambasingi Temperature in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలితో జిల్లాలోని గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో చలితీవ్రత రికార్డు స్థాయిలో పెరిగింది. ఆదివారం ఉదయం లంబసింగిలో 1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాగ, చింతపల్లిలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెల్లడించింది. గత రెండేళ్లలో నమోదైన ఉష్ణోగ్రతలలో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. అలాగే మినుములూరులో 5డిగ్రీలు, పాడేరులో 8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత తట్టుకోలేక స్థానికులు మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
మన్యం ప్రాంతాలను వణిస్తున్న చలి.. ఆంధ్ర కశ్మీర్లో 1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు.! - Lambasingi Tourist Place
Lambasingi Temperature in AP: ఆంధ్ర కశ్మీర్‌గా పేరు పొందిన లంబసింగిలో చలితీవ్రత రికార్డు స్థాయికి పెరిగింది. అలాగే చుట్టు పక్కల ఉన్న మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. చలితో గిరిజనులు వణుకుతూ.. మంటలు వేసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అల్లూరి జిల్లాలో గత కొన్ని రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతోంది. రోజులో కేవలం మధ్యాహ్నం సమయంలో మూడు గంటలు మాత్రమే ఎండ ఉంటోంది. మిగతా సమయంలో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు మంచు అందాలను చూసి పరవశించిపోతున్నారు. సముద్రమట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తులో ఉండటంతో.. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచే దట్టంగా పొగ మంచు కురుస్తోంది. అదేవిధంగా రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు దిగజారి పోతుండడంతో ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాల విద్యార్థులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ చదవండి: