తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ చుట్టుపక్కల పెరిగిన చలితీవ్రత - telangana news

హైదరాబాద్​లో సాధారణం కన్నా 31 శాతం అధికంగా గాలిలో తేమశాతం పెరిగినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నగరం​ చుట్టపక్కల జిల్లాలో చలితీవ్రత పెరిగినట్లు పేర్కొంది.

హైదరాబాద్​ చుట్టుపక్కల పెరిగిన చలితీవ్రత
హైదరాబాద్​ చుట్టుపక్కల పెరిగిన చలితీవ్రత

By

Published : Jan 3, 2021, 1:57 PM IST

తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి రాష్ట్రం వైపు శీతలగాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ప్రభావంతో ఉదయం పూట పొగమంచు కురుస్తున్నట్లు పేర్కొంది. రెండ్రోజుల క్రితం వరకూ ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.

ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల జిల్లాల్లో చలితీవ్రత పెరిగినట్లు వెల్లడించింది. చలిగాలుల కారణంగా గాలిలో తేమ శాతం సాధారణంకన్నా అదనంగా 31 శాతం తేమ పెరిగినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇవీచూడండి:కాస్తంత బెల్లంతో అనారోగ్యాలకు చెక్​

ABOUT THE AUTHOR

...view details