honorarium: మేయర్, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలు పెంపు - కార్పొరేషన్ల పాలకవర్గం గౌరవ వేతనాలు పెంపు
21:51 November 18
honorarium:మేయర్, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలు పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా నగర, పురపాలిక పాలకవర్గం (municipalities and corporations) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పాలకవర్గం గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 30 శాతం వేతనాలు పెంచుతూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మేయర్, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారితో పాటు వైస్ ఛైర్మన్లు, వార్డు సభ్యుల గౌరవ వేతనాలను సైతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మేయర్ వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెరిగినట్లు వెల్లడించింది. డిప్యూటీ మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32,500కు పెంచినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: